దారుణం.. 'జై శ్రీరామ్' నినాదం చేశారని.. ముగ్గురు వ్యక్తులపై దాడి

బెంగళూరులో బుధవారం "జై శ్రీరామ్" నినాదాలు చేశారనే ఆరోపణతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను కొట్టి, దాడి చేశారు.

By అంజి  Published on  18 April 2024 6:47 AM IST
assault,Bengaluru, Jai Shri Ram slogan, Ram Navami

దారుణం.. 'జై శ్రీరామ్' నినాదం చేశారని.. ముగ్గురు వ్యక్తులపై దాడి

బెంగళూరులో బుధవారం "జై శ్రీరామ్" నినాదాలు చేశారనే ఆరోపణతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను కొట్టి, దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రామ నవమి సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ జెండా పట్టుకుని ముగ్గురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్న ఘటన చిక్కబెట్టహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది.

నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు. వీడియోలో, బైకర్లు "జై శ్రీరాం" నినాదాలు ఎత్తకుండా పురుషులను హెచ్చరించడం, బదులుగా "అల్లా హు అక్బర్" అని జపించమని అనడం వినిపిస్తుంది. కొద్ది సేపటికే మాటల వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి, బైకర్లు, కొందరు స్థానికులు కారులో ఉన్న వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురిలో ఒకరి తలపై కర్రతో కొట్టగా, మరొకరికి ముక్కుకు గాయమైందని పోలీసులు తెలిపారు.

''కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు జెండా పట్టుకుని జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు కారును అడ్డుకుని అల్లా హు అక్బర్ అని చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నినాదాలు చేసినందుకు వారిని ప్రశ్నించారు. కారు, బైక్‌పై ఉన్న వారు మరింత మంది యువకులను తీసుకురావడానికి పారిపోయారు. ఆ గొడవలో ఓ వ్యక్తి అతని ముక్కుకు గాయమైంది'' అని బెంగళూరు సిటీ డిసిపి బిఎమ్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.

విధ్యారణ్యపుర పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 295, 298, 324, 326, 506, అల్లర్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తాం అని ప్రసాద్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని ఫర్మాన్, సమీర్‌లుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు మైనర్లేనని చెప్పారు.

Next Story