తూర్పుగోదావరిలో ఆర్టీసీ బస్సు - లారీ ఢీ.. 22 మందికి గాయాలు

22 passengers injured as RTC bus collides truck in East Godavari. తూర్పుగోదావరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో సోమవారం

By అంజి  Published on  14 March 2022 4:44 PM IST
తూర్పుగోదావరిలో ఆర్టీసీ బస్సు - లారీ ఢీ.. 22 మందికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొట్టుకున్నాయి. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వలమూరు వద్ద ఎదురుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రామకృష్ణ, కండక్టర్‌ రమేష్‌ సహా ఇరవై రెండు మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story