షాకింగ్.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైన‌ర్ బాలిక‌

17 Year Old Girl Delivers Baby watching YouTube videos.ఓ 17 ఏళ్ల మైన‌ర్ బాలిక యూట్యూబ్ వీడియోల స‌హాయంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Oct 2021 4:46 AM GMT
షాకింగ్.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైన‌ర్ బాలిక‌

ఓ 17 ఏళ్ల మైన‌ర్ బాలిక యూట్యూబ్ వీడియోల స‌హాయంలో ఇంట్లోనే బిడ్డ‌ను క‌నింది. డెలీవ‌రీ అయిన రెండు రోజుల వ‌ర‌కు ఈ విష‌యం ఇంట్లోని త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. రెండు రోజుల అనంత‌రం బాలిక‌తో పాటు పుట్టిన బిడ్డ‌కు ఇన్పెక్ష‌న్‌ రావ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రం మ‌ల‌ప్పురం జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌లప్పురం జిల్లాలో ఓ 17 ఏళ్ల మైన‌ర్ బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివ‌సిస్తోంది. త‌ల్లికి దృష్టిలోపం ఉండ‌గా.. తండ్రి సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. త‌న ప‌క్కింటిలో ఉండే 21 ఏళ్ల యువ‌కుడితో ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. దీంతో ఇద్ద‌రు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌కావ‌డంతో బాలిక గ‌ర్భం దాల్చింది. దృష్టి లోపం కార‌ణంగా ఈ విష‌యాన్ని త‌ల్లి గుర్తించ‌లేదు. తండ్రి రాత్రి పూట విధులు నిర్వ‌ర్తిస్తూ ఎక్కువ‌గా ఇంటికి వ‌చ్చేవాడు కాదు. ఈ క్ర‌మంలో బాలిక‌కు నెల‌లు నిండాయి. అక్టోబ‌ర్ 20న బాలిక ఇంట్లోని గ‌దిలోకి వెళ్లి పండండి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

యూట్యూబ్‌లో చూసి బొడ్డు తాడును క‌త్తిరించుకుంది. ఈ విష‌యం రెండు రోజుల వ‌ర‌కు బాలిక త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌లేదు. మూడో రోజు బాలుడు ఏడ‌వ‌డంతో విష‌యం బాలిక త‌ల్లికి తెలిసింది. బాలిక‌తో పాటు పుట్టిన పిల్లాడికి ఇన్పెక్ష‌న్ కావ‌డంతో బాలిక త‌ల్లి ఇద్ద‌రిని స‌మీపంలోని ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లింది. త‌ల్లీ బిడ్డ‌లు ఇద్ద‌రూ ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు. మైన‌ర్ బాలిక గ‌ర్భం దాల్చ‌డం గురించి ఆస్ప‌త్రి సిబ్బంది మలప్పురం జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి)కి స‌మాచారం అందించ‌గా.. వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. ప్రసవ స‌మ‌యంలో బాలికకు ఎలాంటి బాహ్య సహాయం అంద‌లేద‌ని తెలిపారు. కుమార్తె ఆన్ లైన్ తరగతుల కోసం గదిలో తాళం వేసుకొని ఉంటుందని తల్లి భావించిందన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పాపకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు బావిస్తున్నారు.

Next Story