Hyderabad: నాగోల్‌లో మిస్సైన బాలుడి కథ విషాదంతం
హైదరాబాద్‌లోని నాగోల్‌లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 6:53 AM GMTHyderabad: నాగోల్‌లో మిస్సైన బాలుడి కథ విషాదంతం
హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. అయితే.. అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. తాజాగా చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనీశ్ అనే పన్నెండేళ్ల బాలుడు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. అతడి తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. దాంతో భయపడిపోయిన తల్లిదండ్రులు నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే షాకింగ్ ఘటన ఎదురైంది. సోమవారం ఉదయం నాగోల్‌లోని ఓ నీటి కుంటలో ఒక బాలుడి మృతదేహం కనిపించింది. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లారు పోలీసులు. నీటి కుంటలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. డిఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని నీటి కుంటలో నుండి వెలికి తీశారు. అయితే.. లభ్యమైన మృతదేహం ఆదివారం అదృశ్యమైన మినీశ్ గానే గుర్తించారు పోలీసులు. దాంతో.. మనీశ్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అయితే నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన మనిష్ మృతదేహం నీటి కుంటలో కనిపిం డంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానస్పద మృతి గా కేసు నమోదు చేశారు. మనీష్ కావాలనే ఇంట్లో నుండి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఎవరైనా అతన్ని హత్య చేసి నీటి కుంటలో పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. మనీష్ అదృశ్యమై చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.