మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఝల్లార్ ప్రాంతంలో జరిగింది.
శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్ఖలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సిమలా ప్రసాద్ తెలిపారు.
అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందా..? డ్రైవర్ నిద్ర మత్తు వల్ల జరిగిందా..? లేదా ఇంకా ఏదైన కారణం ఉందా అన్న కోణంలో విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.