మైన‌ర్లే మృగాలై.. బాలిక‌పై సామూహిక అత్యాచారం

10 Year old raped at Rewari village.నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 11:28 AM IST
మైన‌ర్లే మృగాలై.. బాలిక‌పై సామూహిక అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హ‌ర్యానాలో దారుణం జరిగింది. 10ఏళ్ల బాలిక‌పై 8 మంది దారుణంగా అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అత్యాచార ఘ‌ట‌న మొత్తాన్ని వీడియో తీశారు. ఆ 8 మందిలో ఏడుగురు మైన‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

రెవాడి జిల్లాలో ఓ పాఠ‌శాల స‌మీపంలో 10 ఏళ్ల బాలిక ఆడుకుంటోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కొంద‌రు ఆ బాలిక‌ను పక్క‌కు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యాల‌ను వీడియో తీశారు. స్థానికంగా ఆ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా ఆత్యాచారానికి పాల్ప‌డిన 8 మందిని గుర్తించి అరెస్టు చేశారు. కాగా.. నిందితుల్లో ఏడుగురు మైన‌ర్లు ఉన్నార‌ని డీఎస్పీ హ‌న్స్‌రాజ్ తెలిపారు. వీరిని బాల నేర‌స్థుల గృహానికి త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌రో 18 ఏళ్ల యువ‌కుడిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు.

Next Story