ఎల్బీనగర్‌లో కారు బీభత్సం

By Newsmeter.Network  Published on  27 Nov 2019 7:59 AM GMT
ఎల్బీనగర్‌లో కారు బీభత్సం

హైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదాలు మతిమీరిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఈ రోడ్డు ప్రమాదాలు సామాన్య జనాలకు శాపంగా మారుతున్నాయి. తాజాగా ఎల్బీనగర్ లిమిట్స్ అన్ - లిమిటెడ్ షాపింగ్ మాల్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న కారు ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మ , సత్తెమ్మ అనే ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై కారు అతివేగంగా వచ్చిన కారు, రోడ్డు దాటుతున్న మహిళలను బలంగా ఢీకొట్టి పల్లీలు కొడుతూ మెట్రో పిల్లర్స్ ను ఢీకొట్టింది. కాగా, ఇదే రహదారిలో గత నెల రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వైద్యుడితో సహా... ముగ్గురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. సినిమా షూటింగ్ లో తలపించేలా జరిగిన ఈ ప్రమాదం మరువకముందే తాజాగా మళ్లీ ఈ కారు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Next Story
Share it