హైదరాబాద్‌: శంషాబాద్‌లో దిశ హత్య ఘటనతో యావత్‌ దేశం కదిలింది. మహిళలు, ప్రజలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దిశను నిందితులు రాత్రి 10.28 గంటల సమయంలో లారీలో తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. లారీ వెళ్తున్న దృశ్యాలు తొండూపల్లి టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఈ వీడియో ఆధారంగానే నిందితులను గుర్తించారు. చటాన్‌పల్లి బ్రిడ్జి కింది దిశను పాశవికంగా హత్య చేశారు. దిశ హత్యకు గురైన స్థలంలోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో నేడు సిట్‌ బృందం విచారణ చేపట్టనుంది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలోని బృందం ఘటనా స్థలంలో వివరాలు సేకరించనున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.