భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఏం చేశాడంటే..!
By సుభాష్ Published on 22 Dec 2019 6:40 PM IST
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్ (28) తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ కారణంగా భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన విజయ్‌కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌కుమార్కు ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story