మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం...అక్కాచెల్లెళ్ల‌పై సామూహిక అత్యాచారం

By Medi Samrat  Published on  24 Nov 2019 10:18 AM GMT
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం...అక్కాచెల్లెళ్ల‌పై సామూహిక అత్యాచారం

దేశంలో ఎన్ని చ‌ట్టాలున్నా...అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా కామాంధుల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వాలు చ‌ట్టాలు మార్చి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టినా...దుర్మార్గుల తీరులో ఏ మాత్రం మార్పు రావ‌డం లేదు. రోజురోజుకు కామాంధులు మితిమీరిపోతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అక్కాచెల్లెళ్లపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. రేవా పట్టణంలోని ఘర్19 పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 19న వారు ఓ పని నిమిత్తం బయటకు వెళ్లగా.. ఇద్దరు బాలికలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఇంట్లో ఇద్ద‌రు మ‌హిళ‌లో ఒంట‌రిగా ఉన్న విష‌యం తెలుసుకున్న ముగ్గురు యువ‌కులు మధ్యాహ్నం స‌మ‌యంలో ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించారు. ఇద్దరు యువకుడు చెల్లిని పట్టుకోగా.. మూడో వ్యక్తి అక్కను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంతరం ముగ్గురూ కలిసి చెల్లిని నగ్నంగా ఉంచి లైంగికంగా వేధించారు. తమను వదిలిపెట్టాలని అక్కాచెల్లెళ్లు ఎంత వేడుకున్నా.. ఈ దుర్మార్గుల్లో ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా పోయింది. ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన యువ‌కులు అక్క‌డి నుంచి పరార‌య్యారు.

కొద్దిసేపటికి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఇద్దరూ బాలికలు తమపై జరిగిన దారుణ విష‌యాన్ని చెబుతూ బోరును విల‌పించారు. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కామాంధుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయ‌గా, మరో యువకుడు ప‌రారీలోఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది.

Next Story
Share it