కరోనా నివారణ చర్యల కోసం దేశ వ్యాప్తంగా సినీ తారలు, వ్యాపారస్తులు, స్పోర్ట్స్ స్టార్స్ తమవంతు విరాళాలను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తున్నారు. షట్లర్ పీవీ సింధు ఇటీవలే రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తనవంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. ప్రధాని సహాయ నిధికి రూ.25 లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళమిస్తున్నట్లు తెలిపారు.

Also Read : మూడు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన బన్నీ

మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా తన వంతు సాయంగా మూడు నెలల జీతంతో పాటుగా..బీసీసీఐ ఇస్తున్న పింఛన్ ను కూడా విరాళంగా ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇక సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా రూ.21 లక్షలు ప్రధాని సహాయనిధికి, మరో రూ.21 లక్షలు గుజరాత్ సీఎం సహాయనిధికి అందజేయనున్నట్లు తెలిపింది.

Also Read :లాక్ డౌన్ అయిన వేళ..భారీ విరాళాలిచ్చిన సెలబ్రిటీలు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.