ఆయన సంగీతాన్ని ప్రేమిస్తే.. సంగీతం అతన్ని ప్రేమించింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Sep 2020 1:12 PM GMT
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలే కాకుండా పలువురు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇదిలావుంటే.. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.
బాలు మృతికి సంతాపం తెలిపిన వారిలో..
సురేష్ రైనా
ఒక దిగ్గజ గాయకుడ్ని కోల్పోవడం బాధాకరం. ఈ వార్త విని తీవ్రంగా కలత చెందాను. మీ గాత్రం రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా సంతాపం తెలియజేస్తున్నాను అని రైనా ట్వీట్ చేశారు.
రవిచంద్రన్ అశ్విన్
ఈ ఏడాది మరీ ఇంత దారుణంగా ఉంది. రోజు రోజుకీ ఇంతలా దిగజారిపోతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు చేకూరాలని ప్రార్థిద్దాం’ అని ట్వీట్ చేశాడు.
వాషింగ్టన్ సుందర్
లెజండరీ సింగర్ బాలు సార్ లేరనే వార్త వినడం చాలా బాధాకరం. మీ గాత్రం, మీ పాటలు మాతో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే తరానికి కూడా మీ పాటలు స్ఫూర్తిగా నిలుస్తాయి. మేము మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం.
ధావన్
మీ పాటలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. పాటల రూపంలో మీరు మాతోనే ఉంటారు. ఆయనకు నా ప్రగాఢ సానుభూతి.
ప్రజ్ఞాన్ ఓజా
బాలు గారు లేరనే వార్త నన్ను షాక్ గురి చేసింది. మీరు లేని లోటు పూడ్చలేనిది. మీరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం పెద్ద లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు.
రవిశాస్త్రి
పీడకల వెంటాడుతూనే ఉంది. ఈరోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లేరన వార్తను వినడం బాధనిపించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన సంగీతాన్ని ప్రేమిస్తే.. సంగీతం అతన్ని ప్రేమించిందని ట్వీట్ చేశారు.