భార‌త్‌తో త‌ల‌ప‌డే ఆసీస్ ఆట‌గాళ్లు వీరే.. జ‌ట్టును ఎంపిక చేసిన సీఏ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 8:03 AM GMT
భార‌త్‌తో త‌ల‌ప‌డే ఆసీస్ ఆట‌గాళ్లు వీరే.. జ‌ట్టును ఎంపిక చేసిన సీఏ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి(బీసీసీఐ) ఇప్ప‌టికే ప్ర‌కటించ‌గా.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నేడు భార‌త్‌తో త‌ల‌ప‌డే ఆసీస్ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో దుమ్మురేపుతున్న ఆ జ‌ట్టు ఆట‌గాళ్లును ఏరికోరి ఎంపిక చేసింది. ముఖ్యంగా యువ ఆట‌గాళ్ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చింది. వన్డే, టీ20 మ్యాచ్‌లకు మాత్రమే జట్టును ప్ర‌క‌టించింది. ఇంకా టెస్టు జ‌ట్టులో ఆడే ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌లేదు. వ‌న్డేలు, టీ20ల‌కు ఒకే జ‌ట్టును ఎంపిక చేసింది.

వ‌న్డేల్లో, టీ20ల్లో ఆరోన్ ఫించ్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇక ఐపీఎల్‌లో పుల్ ఫామ్‌లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల కేపెన్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను టీమ్‌లోకి తీసుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్ బౌలింగ్ స్పీడ్‌స్టర్ పాట్ కమ్మిన్స్‌ను టీమ్‌లో చోటు క‌ల్పించింది. అలెక్స్ క్యారీ, హేజిల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాలను వన్డే, టీ20ల్లోకి తీసుకుంది. వారంతా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

జాతీయ జట్టులో కొత్త ఆటగాడికి అవకాశాన్ని కల్పించింది ఆసీస్ బోర్డు. కొత్త ముఖం కామెరూన్ గ్రీన్‌ను టీమ్‌లోకి తీసుకుంది. భారత్‌తో సిరీస్‌ సందర్భంగా అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. 21 సంవత్సరాల కామెరూన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్ క్రికెటర్..ఆల్‌రౌండర్. ఇప్పటిదాకా తొమ్మిది డొమెస్టిక్ వన్డే మ్యాచ్‌లను ఆడాడు. పెర్త్ స్కార్చర్స్ తరఫున 13 టీ20 మ్యాచ్‌లను ఆడాడు.

వ‌న్డే, టీ20ల‌లో పాల్గొనే ఆసీస్ ఆట‌గాళ్లు :

ఆరోన్ ఫించ్(కెప్టెన్‌), సీన్ అబాట్, అస్ట‌న్ అగర్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మోజెస్ హెన్రిక్స్, మామస్ లాబుస్‌ఛాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిఛెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

Next Story