కృష్ణ‌వంశీ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌.. ఇది నిజ‌మేనా..?

By Medi Samrat  Published on  16 Oct 2019 9:18 AM GMT
కృష్ణ‌వంశీ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌.. ఇది నిజ‌మేనా..?

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ.. నుంచి స‌క్సెస్ ఫుల్ మూవీ వ‌చ్చి చాలా సంవ‌త్స‌రాలు అయ్యింది. ఆయ‌న నుంచి ప్రేక్ష‌కులు ఆశించే సినిమాని తెర‌కెక్కించ‌డంలో ఫెయిల్ అవుతున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న‌ప్ప‌టికీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌కుండా మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న కృష్ణ‌వంశీ త‌దుప‌రి చిత్రం గురించి అడిగితే.. అంతా ఓకే అయితే.. నేను చెబుతాను అంటున్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు.

తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... మ‌రాఠీలో విజ‌యం సాధించిన సినిమాని 'నటసామ్రాట్' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషించ‌నున్నార‌ని... ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటించ‌నున్న‌ట్టుగా తెలిసింది. నాగార్జున హీరోగా కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన 'చంద్ర‌లేఖ' సినిమాలో ర‌మ్య‌కృష్ణ న‌టించింది.

ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌లేదు. ఇప్పుడు కృష్ణ‌వంశీ తాజా చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మైతే.. ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Next Story
Share it