అదుపు త‌ప్పిన మెట్రో క్రేన్‌.. ఒక‌రు మృతి

By సుభాష్  Published on  31 Oct 2020 8:56 AM GMT
అదుపు త‌ప్పిన మెట్రో క్రేన్‌.. ఒక‌రు మృతి

ముంబైలో విషాదం చోటు చేసుకుంది. మెట్రో ఫిల్ల‌ర్‌లోకి క్రేన్ దూసుకెళ్ల‌డంతో ఒక‌రు మృతి చెందగా, మరో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెస్ట్‌న్ ఎక్స్ ప్రెస్ హైవే స‌మీపంలో అంధేరి గుండ‌వాలి వ‌ద్ద బ‌స్ స్టాప్ స‌మీపంలో జోగేశ్వ‌రి నుంచి బాంద్రా వైపు వెళ్తున్న మెట్రో క్రేన్ అదుపు త‌ప్పి మెట్రో స్తంభాన్ని ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో క్రేన్ రెండు భాగాలు విడిపోయింది. బస్ స్టాప్ వ‌ద్ద నిల‌బ‌డి ఉన్న ఒక మ‌హిళ క్రేన్ వెనుక చ‌క్రాల కింద ప‌డి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. స‌మీపంలో ఉన్న మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో స్థానికులు గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న స్థ‌లానికి పోలీసులు చేరుకుని ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story
Share it