పశ్చిమ గోదావరి జిల్లా: పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మళ్లీ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు ప్రాజెక్ట్ దగ్గర పగుళ్లు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున భూమి నెర్రలిచ్చుకుంది. అయితే..భయపడాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ యంత్రాలు వాడటం వలన పగుళ్లు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. అధికారులు మాటలు ఎలా ఉన్నప్పటిక..ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఉందని చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story