పేలిన బాణాసంచా..ఆరుగురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 21 Sept 2019 9:08 PM IST

పేలిన బాణాసంచా..ఆరుగురు మృతి

లక్నో, యూపీ: ఉత్తరప్రదేశ్‌లోని బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. మిరేచిలోని ఓ ఇంట్లో బాణాసంచా నిల్వ ఉంచారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి భవనం కూలిపోవడంతో శిథిలాలు కింద పడి ఆరుగురు ప్రాణాలు వదిలారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ముగ్గరు చిన్నారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పేలుడులో ఇంటి యజమాని మున్నీ దేవితో పాటు అంజలి (8), రాధా (12), ఖుషీ (6), సీతల్ (18), రజనీ (14) మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ భారతి తెలిపారు. దేవీ కుమార్తెలు పూజ, మాధురితో సహా మరో 12మంది గాయాల పాలయ్యారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story