పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయండి : సీపీఐ రామకృష్ణ

By రాణి  Published on  25 Dec 2019 11:35 AM GMT
పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయండి : సీపీఐ రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు గత నవంబర్ నుండి పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్, మెస్, కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని కోరారు. ఇప్పటి వీటన్నింటి బకాయిలు రూ.4200 కోట్లకు పేరుకుపోయాయని, పేరుకుపోయిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ విడుదల చేయలేదని రామకృష్ణ జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్, మెస్, కాస్మెటిక్ ఛార్జీలను నేటికీ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధుల నుండి డబ్బులు వసూలు చేసిన తర్వాతే టిసిలు ఇస్తున్నారని, ఈ కారణంగా పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక టీసీలను కాలేజీల్లోనే వదిలేసి చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే విద్యార్ధులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేసి, వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేయాల్సిందిగా రామకృష్ణ జగన్ ను కోరారు.

Next Story