అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విధానం ‘బిల్డ్ ఏపీ కాదు సెల్ ఏపీ’లా ఉందని విమర్శించారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ‘నవరత్నాల పథకం’ కోసం ప్రభుత్వ భూములను, యూనివర్సిటీ స్థలాలను అమ్మాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ, యూనివర్సిటీ స్థలాలను, గెస్ట్ హౌస్ లను అమ్మేస్తే బిల్డ్ ఏపీ ఎలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు.యూనివర్సిటీల స్థలాలను విక్రయించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణం ప్రభుత్వ స్థలాలను అమ్మే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు సీపీఐ రామకృష్ణ.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.