ఢిల్లీ: ‘మీరేంటి..సీనియర్‌ జర్నలిస్టులై ఉండి, ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ, పత్రికా స్వేచ్ఛకు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’ అంటూ దేవులపల్లి అమర్‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.

రామచంద్రమూర్తి ప్రస్తావన తీసుకొస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో వైసీపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌, సీపీఐ నారాయణ భేటీ అయిన సమయంలో ఈ సంభాషణ సాగింది.

జర్నలిస్టు అమర్‌ ఎదో చెప్పుతుండగా.. నారాయణ స్పందిస్తూ నువ్వేమీ చెప్పనవసరం లేదు, నీ వివరణ నాకు అవసరంలేదన్నారు.

ప్రభుత్వ జీవోను సీనియర్‌ జర్నలిస్టులుగా మీరిద్దరూ సమర్థించడం బాధనిపించిందన్నారు. అయినా మీరేం చేస్తారు! ప్రభుత్వ జీతగాళ్లయ్యాక..’ అని నారాయణ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.