హైదరాబాద్ : వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం (సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని సీపీ అంజనీకుమార్ చెప్పారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.