ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్‌: WHO

By సుభాష్  Published on  7 Oct 2020 7:10 AM GMT
ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్‌: WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు ట్రయల్స్‌లో ఉన్నాయి. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధానోమ్‌ ఘిబ్రెయేసుస్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో వ్యాక్సిన్‌పై క్లారిటీ ఇచ్చారు.

మనందరికి వ్యాక్సిన్‌ కావాలి. ఈ ఏడాది చివరిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.. అని అన్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం 9 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, వీటిలో ముఖ్యంగా ఫైజర్‌ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌పైనే అందరి ఆశలు ఉన్నాయని అన్నారు. 2021 చివరికల్లా 2 బిలియన్‌ డోసులను డిస్టిబ్యూట్‌ చేయాలన్నదే టార్గెట్‌ అని అన్నారు.

Next Story