తెలంగాణలో 1135కు చేరిన కరోనా మరణాలు

By సుభాష్  Published on  1 Oct 2020 4:55 AM GMT
తెలంగాణలో 1135కు చేరిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2214 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2214 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,93,600కు చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1135కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 23,702 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇక ఇప్పటి వరకు 30,50,444 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. మరో వైపు జీహెచ్‌ఎంసీలో 305 మందికి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి191, మేడ్చల్‌ 153 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

Next Story