Fact Check : కరోనా వ్యాక్సిన్‌ను 2001లోనే కనిపెట్టారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 April 2020 3:50 AM GMT
Fact Check : కరోనా వ్యాక్సిన్‌ను 2001లోనే కనిపెట్టారా..?

కరోనా వైరస్ మహమ్మారికి టీకా ఎప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచం లోని పలు ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు మందు కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. భారతదేశానికి చెందిన కంపెనీలు కూడా వ్యాక్సిన్ ను తయారుచేయడానికి చాలానే చేస్తున్నాయి. భారత్ కు చెందిన ఓ సీరం కంపెనీ అక్టోబర్ నెలకల్లా కరోనా టీకాను మార్కెట్ లోకి తీసుకుని వస్తామని చెబుతోంది. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అన్నది 2001 లోనే వచ్చేసిందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

ఇంతకూ ఆ పోస్టులో ఏముందంటే “Now this was 2001 tell me why 19 years later, they say there is no vaccine share before they take it down again"

2001 లోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చింది.. కానీ 19 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదని అంటున్నారు. దీన్ని మార్కెట్ లో నుండి మాయం చేయడాని కంటే ముందే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.

కొందరు ఫేస్ బుక్ లో షేర్ చేయగా.. మరికొందరు ట్విట్టర్ లో కూడా షేర్లు చేయడం మొదలుపెట్టారు.



నిజమెంత:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టును ఓపెన్ చేస్తే 'Nobiviac 1-Cv canine vaccine' అని ఉంది. దీన్ని కొన్ని కీ వర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేస్తే దీన్ని మెర్క్ అనిమల్ హెల్త్ సంస్థ తయారుచేసింది. దీన్ని కుక్కలలో 'కెనైన్ కరోనా వైరస్' వ్యాపించకుండా వేసే మందు.

అందుకు సంబంధించిన వివరణ ఇస్తూ తీసిన లింక్ ఇది

https://www.merck-animal-health-usa.com/nobivac/nobivac-canine-1-cv#Canine_1-Cv_Overview

'కెనైన్ కరోనా వైరస్' అన్నది 1971 లో తొలిసారి కనుక్కున్నారు. ఈ వైరస్ కారణంగా కుక్కలలో జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ కోవిద్-19 లేదా నావల్ కరోనా వైరస్ కారణంగా మనుషుల్లో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం కరోనా వైరస్ అన్నది ఒక వైరస్ ల కుటుంబం. వివిధ రకాల కరోనా వైరస్ లు ఉన్నాయి. వాటిని కనుక్కున్నారు కూడానూ..! వీటి కారణంగా మనుషుల్లోనూ, జంతువుల్లోనూ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనుషుల్లో కరోనా వైరస్ ల కారణంగా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులే తలెత్తుతూ ఉంటాయి. చిన్న ఇన్ఫెక్షన్ ద్వారా జలుబుతో మొదలుకుని.. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(SARS).. వ్యాధులతో పాటూ ఇటీవల వచ్చిన COVID-19 కూడా కరోనా వైరస్ కుటుంబం నుండి వచ్చిన వ్యాధే. కోవిద్-19 నావల్ కరోనా వైరస్ కారణంగా వచ్చిన వ్యాధి.

వివిధ రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం ఈ లింక్ లో

https://www.who.int/news-room/q-a-detail/q-a-coronaviruses

ముఖ్యంగా కోవిద్-19 కు ఎటువంటి వ్యాక్సిన్ లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.

సెంటర్ ఫర్ సెల్యులర్ మైక్రోబయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ జంతువుల విషయం వాడే వ్యాక్సిన్ లు వేరుగా ఉంటాయని.. మనుషుల కోసం వాడివి వేరే ఉంటాయని అన్నారు. ఎన్నో అప్రూవల్స్ పూర్తయ్యాకనే ఒక వ్యాక్సిన్ ను విడుదల చేస్తారు. జంతువులలో వచ్చిన 'కెనైన్ కరోనా వైరస్' కు వాడే వ్యాక్సిన్ ను మనుషుల మీద వాడడం చాలా ప్రమాదకరం.. ఎవరూ వాడరు కూడా అని తేల్చి చెప్పారు.

కోవిద్-19 కోసం 2001 లోనే వ్యాక్సిన్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్దం'.. ఫొటోలో చూపించిన వ్యాక్సిన్ జంతువుల కోసం ఉపయోగించే వ్యాక్సిన్.

Claim Review:Fact Check : కరోనా వ్యాక్సిన్‌ను 2001లోనే కనిపెట్టారా..?
Claim Fact Check:false
Next Story