Hyderabad: అప్పు తీర్చలేదని దంపతుల దారుణ హత్య

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుది. అప్పు తీర్చలేదని దుండగులు దంపతులను హత్య చేశారు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 11:14 AM IST
wife, husband, murder,  hyderabad,

 Hyderabad: అప్పు తీర్చలేదని దంపతుల దారుణ హత్య

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుది. అప్పు తీర్చలేదని దుండగులు దంపతులను హత్య చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన.. ఫిలింనగర్‌లోని సత్యకాలనీలో జరిగింది.

దంపతులు ఖాద్రీ, ఫాతిమా సత్యకాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ముంబైకి చెందిన వ్యాపారుల నుంచి రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మూడేళ్ల క్రితమే డబ్బులు తీసుకుని మేకల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే.. అప్పటి నుంచి డబ్బులు చెల్లించకుండా వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు. దాంతో.. ఆగ్రహానికి లోనైన వ్యాపారులు ఈ నెల 2వ తేదీన హైదరాబాద్‌లోని టోలిచౌకికి వచ్చారు. ఈ నెల 3న ఖాద్రిని కిడ్నాప్‌ చేశారు. డబ్బులు ఇవ్వనందుకు అతన్ని హత్య చేసి పాతిపెట్టారు.

ఆ తర్వాత భార్య ఫాతిమా భర్త కిడ్నాప్‌ అయ్యాడన్న వార్త బయటపెతుందని దుండగులు భయపడ్డారు. ఆ క్రమంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తే తమ విషయం బయటపడుతుందని అనుకున్నారు. దాంతో.. మరుసటి రోజే వాళ్లు ఫాతిమా ఇంటికి వెళ్లారు. ఫాతిమాకు బలవంతంగా ఉరివేసి చంపేశారు. ఆ తర్వాత గ్యాస్‌ లీక్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫాతిమాతో మాట్లాడేందుకు ఆమె చెల్లి ఫోన్‌ చేసి ప్రయత్నించింది. మూడ్రోజులు గడుస్తున్నా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.. పైగా తిరిగి కూడా కాల్‌ చేయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఇంటికి వచ్చి ఫాతిమా ఇంటి తలుపులు తెరిచి చూసింది. ఇంట్లో ఫాతిమా మృతదేహం చూసి ఆమె చెల్లెలు కన్నీరుమున్నీరు అయ్యింది.

అయితే.. పిల్లలు పుట్టలేదని అందుకే తన అక్కని చంపి బావ ఖాద్రి పారిపోయాడని చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఫిలింనగర్ పోలీసులు పోలీసులు ఖాద్రి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఫాతిమా ఇంటి నుంచి ముగ్గురు అనుమానాస్పదంగా బయటకు రావడం గుర్తించారు. ఆ తర్వాత వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కిడ్నాప్‌, హత్య వెలుగులోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story