క‌రోనా బాధితుడి ఒక టీస్పూన్‌ లాలాజలంలో ఎంత వైర‌స్ ఉంటుందంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2020 7:48 AM GMT
క‌రోనా బాధితుడి ఒక టీస్పూన్‌ లాలాజలంలో ఎంత వైర‌స్ ఉంటుందంటే..?

కరోనా పేరు చెబితే చాలు వ‌ణిక‌పోయే పరిస్థితులు ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా 13వేల మందికిపైగా మృత్యువాత ప‌డగా.. 3ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌తుల్లో చికిత్స పొందుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైర‌స్ త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచ దేశాల్లో విస్త‌రిస్తోంది. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టిన వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట‌వేయ‌లేక‌పోతున్నాయి. ఓ క‌రోనా వైర‌స్ పాజిటివ్ పేషంట్‌లో ఎంత వైర‌స్ ఉంటుందో తెలుసా..? కరోనా బాధితుడి(కొవిడ్‌-19) టీ స్ఫూన్ లాలాజ‌లంలో అక్ష‌రాల యాభై వేల కోట్ల క‌రోనా వైర‌స్ ఉంటుంది.

ఓ ద‌గ్గు లేదా తుమ్ము చాలు.. ఈ వేల కోట్ల వైర‌స్ కొన్ని తుంప‌ర్ల‌తో క‌లిసి ప‌రిస‌రాల్లో చేరిపోయేందుకు. ఆ స‌మ‌యంలో క‌రోనా బాధితుడి ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నా స‌రే.. అటుఇటుగా 32,456 వైర‌స్ నోరు, గొంతు పై పొర‌ల్లో చేరిపోతాయి. ఆ త‌రువాతి క్ష‌ణం నుంచి ఆ వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్‌ల సంఖ్య ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరగడం మొద‌ల‌వుతుంది. తరువాత ఒక్కో దశలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు ఇంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటున్నాయో ఇట్టే అర్థమైపోతుంది.

క‌రోనా బాధితుడు చేతిని అడ్డుపెట్టుకుని ద‌గ్గినా, తుమ్మినా చాలు ఈ కోటాను కోట్ల వైర‌స్ అత‌ని చేతిపై ఉండిపోతుంది. ఆ చేతుల‌తో తాకిన ప్ర‌తి చోటా వైర‌స్ ఉండిపోతుంది. ఉపరితలాన్ని బట్టి ఈ వైరస్‌ రెండు గంటల నుంచి మూడు రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఇటీవలే అమెరికాలో జరిగిన పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ బాధితుడు ఒక్క మాట మాట్లాడితే చాలు.. అతడి గొంతు నుంచి పైకి వచ్చే గాలి ద్వారా వైరస్‌లతో కూడిన చిన్నచిన్న తుంపరలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని వైరస్‌లు ఇతరులు తినే ఆహారంపై చేరిపోవచ్చు. మరికొన్ని వేళ్లమధ్యలో ఉండిపోవచ్చు. మరికొన్ని ముక్కు ద్వారా సైనస్‌లోకి చేరి మళ్లీ గొంతులో స్థిరపడిపోవచ్చు. ఈ దశలో ఒక్క షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా సరే.. అవతలి వ్యక్తి చేతులపై కనీసం 43,654 వైరస్‌లు పోగుపడతాయని, షేక్‌హ్యాండ్‌ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 3,12,405కు చేరుతుందని అంచనా. తడిగా ఉండే కణజాలంపై ఇబ్బడిముబ్బడిగా ఈ వైర‌స్ పెరుగుతాయి. ఈ వైరస్‌లు ఎంత సూక్ష్మస్థాయిలో ఉంటాయంటే.. మన వెంట్రుకను ఫుట్‌బాల్‌ మైదానం అంత సైజుకు పెంచితే వైరస్‌ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే ఉండేంత!

అంటే.. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. మనుషులకు మీటర్‌ ఎడంగానే ఉంటున్నా కొంచెం కష్టమైనా సరే.. బలవంతంగా చేతులను ముఖానికి తాకకుండా జాగ్రత్త పడుతున్నా కూడా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయన్నమాట.

Next Story