తెలంగాణలో కొత్తగా 92 కేసులు.. ఐదుగురు మృతి

By సుభాష్  Published on  9 Jun 2020 1:27 AM GMT
తెలంగాణలో కొత్తగా 92 కేసులు.. ఐదుగురు మృతి

తెలంగాణలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇతర జిల్లాల్లో కేసులు నమోదు కాకపోయినా.. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోమాత్రం తీవ్రంగా ఉంది. సోమవారం రాత్రి విడుదల చేసిన న్యూస్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 92 కేసులు నమోదయ్యాయి. ఇక ఐదుగురు మృతి చెందారు. తాజాగా తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3742 ఉండగా, ఇప్పటివరకూ 142 మంది మృతి చెందారు. మరో వైపు కరోనా లక్షణాలు లేని రోగులను సైతం ఇళ్లకు పంపించారు. తాజాగా 393 మందిని పేషంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి హోం క్వారంటైన్‌కు పంపుతున్నామన్నారు.

తమ ఇళ్లల్లో ప్రత్యేకగది వసతి కలిగిన 310 మందిని హోంక్వారంటైన్‌కు, మిగితా 83 మందిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు చెప్పారు. ఇందు కోసం 30 ప్రత్యేక అంబులెన్స్‌లు, 3 బస్సులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.వీరంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని, వారిపై వైద్యుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. బాధితులు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే కోవిడ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి తెలుపాలన్నారు.

Next Story