భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో 76,472 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 5:27 AM GMT
భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో 76,472 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం 70వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 76,472 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,021 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 34,63,973 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 26,48,999 మంది కోలుకున్నారు. 7,52,424 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1,021 మంది మరణించారు. ఇక దేశంలో రికవరీ రేటు 76.47శాతం ఉండగా.. మరణాల రేటు 1.81 శాతంగా ఉంది. కాగా.. నిన్న ఒక్క రోజే 9,28,761 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 60,96,235 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 38,12,605 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌లో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరికొద్ది రోజుల్లోనే భారత్‌ రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story
Share it