సనత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పై మహిళ దాడికి పాల్పడింది. పాఠశాల విద్యార్థులు ఆటలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని ఆగ్రహాంతో బాలుడిని మహిళ, ఆమె భర్త విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలు తట్టుకోలేక సదరు చిన్నారి.. వారి కాళ్లపై పడ్డా కనికరించకుండా.. కర్కశంగా వ్యవహరించారు.

అంతేకాకుండా.. లేబర్‌ పిల్లలు, చిల్లరగాళ్లు అంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆదంపతులు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థిని కొట్టిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

Newsmeter.Network

Next Story