సూర్యాపేట జిల్లా: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతోంది.? ముందస్తు ఎన్నికలు జరిగిన 9 నెలల తర్వాత వచ్చిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాలపైనే అందరి దృష్టి. అయితే పలు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. సూర్యాపేట మార్కెట్‌లో.. కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. అ నేపథ్యంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ఒక్కో టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్‌, కౌటింగ్‌ సూపర్వైజర్‌, కౌటింగ్‌ అసిస్టెంట్‌ ఉంటారు. అయితే మధ్యాహ్నాం 2 గంటల లోపే ఫలితాలపై క్లారీటి వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కౌటింగ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు144 సెక్షన్‌ విధించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.