నాంపల్లి కోర్టులో రవిప్రకాష్‌పై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 10:47 AM GMT
నాంపల్లి కోర్టులో రవిప్రకాష్‌పై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేయడంతో ఎమ్మెస్‌ జే కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చినట్టు హైకోర్టుకు రవి ప్రకాష్‌ తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఆర్డర్‌ కాపీ చూపించాలని జడ్జి అడిగారు. ఇంకా ఆర్డర్‌ కాపీ తమకు రాలేదని, రేపటిలోగా ఆర్డర్‌ కాపీ సబ్మిట్‌ చేస్తామని రవి ప్రకాష్‌ తరపు న్యాయవాది తెలిపారు. రవి ప్రకాష్‌కు బెయిల్‌ మంజూరు చేయొద్దంటూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణ నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Next Story
Share it