ముంబైలో కరోనా కరాళ నృత్యం..ఒక్కరోజే 150 కేసులు

By రాణి  Published on  13 April 2020 5:01 PM GMT
ముంబైలో కరోనా కరాళ నృత్యం..ఒక్కరోజే 150 కేసులు

  • ఆర్థిక రాజధానిలో 100 కు చేరిన మృతుల సంఖ్య
  • ధారావిలో పెరుగుతున్న కేసుల సంఖ్య

భారత్ లో కూడా కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 905 కొత్త కేసులు నమోదవ్వగా 51 మంది మృతి చెందినట్లు భారత వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 9352 కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 8048 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 324కు పెరగగా 979 మంది మృతి చెందినట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా సోకి 11 మంది వైద్యులు మృతి చెందారు.

Also Read : వామ్మో.. ఈ వైర‌స్ ఎవ్వ‌రికి అంతుచిక్క‌ట్లే..

అత్యధికంగా మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 352 పాజిటివ్ కేసులు నమోదవ్వగా వీటిలో ముంబైలోనే 150 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 2334 కరోనా కేసులు నమోదవ్వగా 160 మంది చనిపోయారు. మృతుల్లో కూడా అత్యధికంగా 100 మంది ముంబై వాసులే. ఇక తెలంగాణలో కూడా 61 కొత్త కేసులు నమోదవ్వడంతో కరోనా బాధితుల సంఖ్య 592 కు పెరిగింది. మృతుల సంఖ్య 17కు చేరింది.

Also Read :స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఏపీ

Next Story