వంద దాటేసిన కరోనా దేశాలు
By రాణి Published on 9 March 2020 6:07 PM IST
కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుంది. చైనాలో ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రవ తగ్గుతుండగా..ఇరాన్, ఇటలీ, దక్షిణకొరియా దేశాల్లో మాత్రం కరోనా వైరస్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ తాజాగా మరో 8 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. దీంతో కరోనా ప్రభావిత దేశాల సంఖ్య వందకు చేరింది. దక్షిణ కొరియా, ఇరాన్ లలో కన్నా ఇటలీలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది.
చైనా తర్వాత ఆ స్థాయిలో కరోనా వైరస్ తో బాధింపడుతుందీ ఇటలీ. ఇప్పటి వరకూ ఈ దేశంలో 7 వేల మందికి పైగా కరోనా బారిన పడగా..నాల్గవవంతు ప్రజల్ని పూర్తిగా ఇండ్లలోనే ఉండాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దక్షిణ కొరియాలో కూడా 7 వేలమందికి పైగా వైరస్ ప్రభావిత బాధితులున్నారు.
Also Read :
ఢిల్లీ అల్లర్లపై ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం
24 గంటల్లో (ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు) కొత్తగా 9 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. మాల్దీవులు, బల్గేరియా, అల్బేనియా, కోస్టారికా, ఫారో ఐలాండ్స్, ఫ్రెంచ్ గయానా, మాల్టా, మార్టినిక్, రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా దేశాల్లో కరోనా బాధితుల్ని గుర్తించారు.
ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. సోమవారం మరో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో కరోనా బాధితుల సంఖ్య 43కి పెరిగింది. కేరళలో మూడేళ్ల చిన్నారితో పాటు జమ్మూకశ్మీర్ లో మహిళలు, యూపీలో, ఢిల్లీలో ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖాధికారులు నిర్థారించారు. గత వారం దేశంలో 6 కరోనా కేసులే ఉండగా..వారం తిరిగొచ్చేసరికి ఈ సంఖ్య 43కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో 16 మంది ఇటలీ దేశస్తులున్నారు.
కరోనా భయంతో ఇరాన్ లో చిక్కుకుపోయిన 300 మంది కాశ్మీరీ విద్యార్థుల తల్లిదండ్రులతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. త్వరలోనే వారందరినీ ఇండియా తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.