కరోనా వైరస్‌ పసికందులను సైతం వదలడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. మృత్యువును వెంటాడుతోంది. కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా మరో ఏడు కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కర్ణాటకలో పాజిటివ్‌ల 62 వరకు చేరింది. ఇక కరోనా కేసుల్లో పది నెలల పసికందు ఉండటంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ బాబు తల్లిదండ్రులది దక్షిణా కన్నడ జిల్లా కాగా, వారెవరూ కూడా విదేశాలకు వెళ్లి రాలేదు. కానీ ఇటీవల ఆ కుటుంబం కేరళ వెళ్లి వచ్చిందని తెలుస్తోంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక కాంటాక్ట్‌ అయిన ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు.

కొలంబో వెళ్లి మార్చి 15న బెంగళూరుకు వచ్చిన 20 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు. ఇక లండన్‌ నుంచి మార్చి 18వ తేదీని బెంగళూరుకు వచ్చిన 26 ఏళ్ల యువతికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంతేకాదు ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలకు కూడా కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇక దుబాయ్‌కు వెళ్లి వచ్చిన ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడికి కరోనా వచ్చింది. ఇక తుమకూరు జిల్లాకు చెందిన 66 ఏళ్ల వృద్దుడు కరోనాతో మరణించాడు. ఇలా రోజురోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాఆందోళన చెందుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.