కరోనా వైరస్‌పై ఫేసుబుక్ వార్.!
By అంజి
ఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేసుబుక్.. కరోనా వైరస్‌పై పోరాడేందుకు ముందుకు వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయమై తప్పుడు వార్తలు, కథనాలు, వందంతులకు చెక్ పెట్టే విషయంలో సాయం చేయనుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం ఉచితంగా ప్రకటలు ఇచ్చేందుకు సిద్ధమైంది. యూజర్లు తప్పుడు సమాచారం బారిన పడకుండా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఒక ప్రకటలో తెలిపారు.
కరోనా వైరస్ భయంతో ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేసుబుక్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మిగతా సంస్థలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరినన్ని.. కరోనా వైరస్ నివారించేందుకు ఉచితంగా ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని జుకర్ బర్గ్ తెలిపారు. తమ కంపెనీ తప్పుడు సమాచారాన్ని ఆన్‌లైన్ నుంచి తొలగిస్తుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాటిని వెంటనే ఫేస్‌బుక్ నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వైద్య రంగ నిపుణులతో కలిసి ఫేస్‌బుక్ పని చేస్తుందన్నారు.
యాడ్‌క్రెడిట్స్ రూపంలో ఇది ఇతరులకు సహకరిస్తుందని జుకర్‌బర్గ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 93 వేలకు మందికిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. మూడు వేలకు పైగా మృతి చెందారు. కరోనా వైరస్ కారణంగా పలు దేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. దీనిపై యూఎన్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.