కరోనా వైరస్ ఏ దేశాల్లో ఎంత మందికి.. మరణాలు ఎన్ని..!
By సుభాష్ Published on 22 March 2020 4:28 AM GMTముఖ్యాంశాలు
కరోనా మరణాల్లో మొదటి స్థానంలో ఇటలీ
రెండో స్థానంలో చైనా
భారత్‌తో 300కు పైగా చేరిన కరోనా కేసులు
భారత్‌లో విజయవంతంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు ప్రాణాంతకరంగా మారింది. ఇక డిసెంబరర్ 31 నాటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతుపట్టని ఓ వైరస్ చైనాలో కొంపముంచుకొస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. చైనాలో న్యుమోనియా కేసులు అంతా ఇంతా కాదు. అప్పట్లో టెంపరరీగా నావల్ కరోనా వైరస్ అని నామకరణం చేశారు. చైనాలో వ్యుహన్ నగరంలో ఓ గుహలో గబ్బిలాలకు సోకినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఆ గబ్బిలాలను పాములు తినడం వల్ల పాములకు సోకిందని, ఆ పాములను చైనా వాళ్లు తినడం వల్ల ఈ వైరస్ మనుషులకు సోకిందని నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు.
2002లో వచ్చిన సార్స్ వైరస్ లాగానే కరోనాకు చికిత్స కనిపెట్టలేకపోతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 307,626 మందికి కరోనా పాజిటివ్ రాగా, 95,797 మంది నెమ్మది ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారిన 13,207 మంది మరణించారు. ఇక చికిత్స పొందుతున్న వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా మరణాల్లో మొదట్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం చైనాను వెనక్కి నెట్టేసిన ఇటలీ మొదటి స్థానంలో చేరింది. ఇక రెండో స్థానంలో చైనా ఉంది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
భారత్‌లో..
తాజాగా భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య 300పైగా చేరింది. ఐదు మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణలో 21 కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకకు జనతా కర్ఫ్యూ చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునివ్వడంతో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు కర్ఫ్యూను పాటిస్తున్నారు.
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం 24 గంటల పాటు అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. బంద్ కారణంగా ఆయా డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైళ్లు సైతం నిలిచిపోయాయి. కర్ఫ్యూ వల్ల రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ జనతా కర్ఫ్యూ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి బారిన ఏ దేశంలో ఎంత
దేశం | కరోనా నిర్ధారణ | కోలుకున్న వారు | మృతులు |
చైనా | 81,056 | 72,442 | 3,264 |
ఇటలీ | 53,578 | 6072 | 4,558 |
ఇరాన్ | 20,610 | 7,635 | 1,556 |
యూఎస్ | 26,685 | 176 | 340 |
ఫ్రాన్స్ | 14,459 | 1,587 | 562 |
సౌత్ కోరియా | 8,899 | 2,909 | 104 |
ఇండియా | 332 | 23 | 5 |
సింగపూర్ | 432 | 140 | 2 |
జపాన్ | 1,054 | 215 | 36 |
హంకాంగ్ | 274 | 100 | 4 |
తైలాండ్ | 412 | 44 | 1 |
మలేషియా | 1,897 | 114 | 8 |
తైవాన్ | 411 | 44 | 1 |
ఇతరులు | 69,136 | 49,147 | 2,766 |