భారత్‌లో 57లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2020 5:20 AM GMT
భారత్‌లో 57లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 86,508 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 57,32,519కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 46,74,988 మంది కోలుకున్నారు. 9,66,382 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్క రోజే 1,129 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 91,149కు పెరిగింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 81.55శాతం ఉండగా.. మరణాల రేటు 1.59శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 11,56,569 శాంపిళ్లను పరీక్షించగా.. ఇప్పటి వరకు 6,74,36,031 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 71లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది.

Next Story