తెలంగాణలో 1,79,246 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  24 Sep 2020 3:26 AM GMT
తెలంగాణలో 1,79,246 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక రోజు కేసుల సంఖ్య తగ్గినా.. మరుసటి రోజు పెరుగుతోంది. ఏదీ ఏమైనా పూర్తిగా తగ్గిపోయేంతా రోజులు ఇంకా దూరంగానే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పాజిటివ్‌ కేసులపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 8 మంది మృతి చెందారు. ప్రతి రోజు కూడా మరణాల సంఖ్యకూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

గడిచిన 24 గంటల్లో ..

పాజిటివ్‌ కేసుల సంఖ్య – 2,176

మరణాల సంఖ్య – 8

కోలుకున్నవారు – 2,004

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -1,79,246

మొత్తంమరణాల సంఖ్య – 1070

మొత్తం యాక్టివ్‌ కేసులు – 30,037

ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య – 23,929

రాష్ట్రంలో కోలుకున్నవారు – 1,48,139

రాష్ట్రంలో మరణాల రేటు – 0.59 శాతం

దేశంలో మరణాల రేటు – 1.59 శాతం

రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు – 82.64 శాతం

దేశంలో కోలుకున్నవారి రేటు - 81.42 శాతం

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసుల జిల్లాలు

జీహెచ్‌ఎంసీ - 308

కరీంనగర్‌ - 120

మేడ్చల్‌ మల్కాజిగిరి -151

నల్గొండ -136

రంగారెడ్డి - 168 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story