వామ్మో.. అప్పుడే పుట్టిన శిశువును కూడా వదలని 'కరోనా'

By సుభాష్  Published on  14 March 2020 2:43 PM GMT
వామ్మో.. అప్పుడే పుట్టిన శిశువును కూడా వదలని కరోనా

కరోనా ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అప్పుడు పుట్టిన శిశువులను సైతం వదలడం లేదు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 5వేలకు పైగా మృతి చెందగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా లండన్‌లో ఓ శిశువుకు పుట్టిన కొన్నిగంటల్లోలో కరోనా సోకింది. నగరంలోని నార్త్‌ మిడిలెక్స్‌ ఆస్పత్రిలో ఓ శిశువుకు పరీక్షలు నిర్వహించగా, కరోనా పాటిజివ్‌ వచ్చింది. కాగా, ఆ శిశువు ప్రపంచంలో కరోనా వైరస్‌ సోకిన అతి చిన్న వయస్కురాలిగా నమోదు అయింది.

కాగా, శిశువు తల్లి కొన్ని రోజులుగా న్యుమోనియాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసింది. గర్భిణీగా ఉన్న ఆమె ప్రసవం కాగానే శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో శిశువుకు కరోనా వైరస్‌ ఉన్నట్లు రిపోర్టులో స్పష్టమైంది. అయితే శిశువుకు గర్భంలో ఉండగానే వైరస్‌ సోకిందా .. లేదా పుట్టిన తర్వాత సోకిందా అనేది నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు వైద్యులు. తల్లి, బిడ్డలను ఇద్దరిని వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం యూకేలో కరోనా సోకిన కేసుల సంఖ్య 798కి చేరగా, 10 మంది మృతి చెందారు.

Next Story