స్విమ్స్ వైద్యులకు కరోనా లక్షణాలు

By రాణి  Published on  27 March 2020 9:08 AM GMT
స్విమ్స్ వైద్యులకు కరోనా లక్షణాలు

  • 12కు చేరిన ఏపీ కరోనా కేసుల సంఖ్య

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ విధించడంతో..ఒక్కొక్కరిలో ఉన్న కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్థారణవ్వడంతో ఏపీ కరోనా కేసుల సంఖ్య 12కి చేరింది. అలాగే తిరుపతిలో ఇద్దరు స్విమ్స్ వైద్యులకు కరోనా లక్షణాలు ఉండటంతో వారిద్దరినీ క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు వైద్యుల రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్స్ కు పంపించారు.

Also Read : రూ.50 లక్షల విరాళమిచ్చిన క్రికెట్ దిగ్గజం

స్విమ్స్ వైద్యులకు కరోనా లక్షణాలున్నాయని తెలిసినప్పటికీ ఆస్పత్రి వర్గమంతా ఆందోళనకు గురవుతోంది. రాష్ట్రంలో 384 కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా..317 మందికి కరోనా నెగిటివ్ అని తేలింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also Read : మూడు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన బన్నీ

దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 724 కు పెరిగింది. 17 మంది మృతి చెందారు. కరోనా ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించినా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక మనిషికి కరోనా సోకితే..14 రోజులకు గానీ..వారిలో కరోనా లక్షణాలు బయటపడవు. ఈ 14 రోజుల్లో ఆ వ్యక్తి ఎంత మందిని కలిస్తే అంతమందికీ కరోనా సోకుతుంది. ఇలా దేశ వ్యాప్తంగా కరోనా సోకే ప్రమాదముండటంతోనే ప్రధాని ఏప్రిల్ 14 వరకూ ఇండియా లాక్ డౌన్ విధించారు.

Next Story
Share it