అలా పడుకుంటే.. 'కరోనా' నుంచి ఉపశమనం..!

By Newsmeter.Network  Published on  26 March 2020 9:17 AM IST
అలా పడుకుంటే.. కరోనా నుంచి ఉపశమనం..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో ఈ వైరస్‌ భారిన పడినవారి సంఖ్య 600కు మించిపోయింది. మరోవైపు పదకొండు మంది వరకు మృతి చెందారు. దీంతో రోజురోజుకు ఆందోళన పెరుగుతూనే ఉంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌కు పిలుపునిచ్చారు. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. పలు ప్రాంతాల్లో బయటకు వచ్చిన వారిని పోలీసులు హెచ్చరించి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇలా ఎవరి ఇండ్లకు వారు పరిమితం కావడం వల్ల వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉంటే చైనాలోని వ్యూహాన్‌ వైద్యులు ఈ వైరస్‌ సోకిన వారిపై అనేక పరిశోధనలు చేశారు. వూహాన్‌లోని జిన్‌యింటాన్‌ ఆస్పత్రికి చెందిన 12మంది వైద్యుల బృందం ఈ వైరస్‌ సోకిన రోగులపై అధ్యయనం జరిపి అనంతరం ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారికి రోగ నిరోధక శక్తి ఉంటే తప్పకుండా ప్రాణాలతో బయటపడవచ్చునని వారు వెల్లడిస్తున్నారు. లేకుంటే వైరస్‌ పెట్టే ఇబ్బంది భరిస్తూ నరకయాతన అనుభవించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ వైరస్‌ సోకిన వారు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది తొలగాలంటే మంచంపై తలకిందుకు వంచి బోర్లా పాడుకుంటే ఉపశమనం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

రోగి బోర్లా పడుకొని నిద్రించినప్పుడు శ్వాసనాళాల ద్వారా రెండు ఊపరితిత్తుల్లోకి గాలి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తోందని వారు తెలిపారు. కరోనా వైరస్‌ ముక్కు, నోరు ద్వారా గొంతులో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో తిష్టవేస్తుంది. అక్కడకు వెళ్లిన వైరస్‌ అక్కడి కణాలను నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది చేసే దాడిని తట్టుకొనే రోగ నిరోధక శక్తి శరీరానికి ఉంటే తప్పకుండా ప్రాణాలతో బయటపవచ్చు.

Next Story