కరోనాను “షూట్” చేస్తున్న సినీ పరిశ్రమ
By రాణి Published on 16 March 2020 9:55 AM GMTకరోనా నగరాల మూతులకు మాస్కులు కట్టింది. చేతులకు సబ్బు పట్టించి కడిగింది. మెట్రోలు మూతపడ్డాయి. మహానగరాలు ముసుగుతన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా రంగం కూడా తన కార్యకలాపాలకు మార్చి 31 వరకూ కామా పెట్టింది. షూటింగులు ఆగిపోయాయి. అవుట్ డోర్లు నిలిచిపోయాయి. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్, మన మూవీ ఆర్టిస్ట్స్అసోసియేషన్ వంటి సంస్థలు కూడా షూటింగ్ లు నిలిపివేయాలని పిలుపునిచ్చాయి. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లవద్దని కూడా సలహా ఇచ్చారు.
Also Read : ప్రాణాలమీదికి తెచ్చిన సైకోతో వివాహేతర సంబంధం..
అయితే ఒకరిద్దరూ తప్పనిసరై షూట్ చేయాల్సి వచ్చినా సెట్లలో సానిటైజర్లు, సబ్బులు, మాస్కులు సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. లక్నో, బెనారస్ వంటి నగరాల్లో కొన్ని షూటింగ్ లు జరుగుతున్నాయి. వాటిల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇదే తరహాలో ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందికి మాస్కులు ఎందుకు పెట్టుకోవాలో, చేతులు ఎందుకు కడుక్కోవాలో తెలియచేయాలని కూడా కౌన్సిల్ నిర్మాతలను కోరింది. అనారోగ్యం ఉన్న వారికి సెలవులు ఇచ్చేయమని, వారిని సెట్స్ కి రాకుండా చూడాలని సలహా కూడా ఇచ్చింది. సెట్స్ లో వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పింది.
Also Read : విమానయానంలో కరోనా కేర్
ఇప్పటికే చాలా యూనిట్లు ప్రతి పదిహేను అడుగులకు ఒక సానిటైజర్ ను అందుబాటులో ఉంచాయి. సిబ్బంది అందరికీ మాస్కులు సరఫరా చేశాయి. మేకప్ రూమ్ లను ప్రతి గంటకీ ఒక సారి పూర్తిగా క్లీన్ చేసి, పరిశుభ్రంగా ఉంచుతున్నారు. తుమ్ములు, దగ్గులు వచ్చేటప్పుడు చేతిని అడ్డుపెట్టుకోవాలని అందరికీ చెబుతున్నారు. ఇప్పటికే సుప్రసిద్ధ టీవీ సీరియల్ తారక్ మెహతా కా ఉల్టా చష్మా లో ఒక ఎపిసోడ్ ను కరోనాకు కేటాయించారు. మరో వైపు ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్ “కరోనా ప్యార్ హై” అనే సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. కరోనా స్పెల్లింగ్ karona కి బదులు Corona ను పెట్టుకున్నాడు.
Also Read : కరోనాపై స్పందించిన జక్కన్న