తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కరోనా మహమ్మారి పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల వెంటాడుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, మంత్రులకు సోకిన ఈ వైరస్‌.. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు సైతం కరోనా బారిన పడ్డారు. ఆయనకే కాదు ఇద్దరు పిల్లలకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పరీక్షలు చేస్తే పాజిటివ్‌ తేలింది. ప్రస్తుతం వీరు సెల్ప్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఇలా ఎమ్మెల్యేలకు, మంత్రులకు పాజిటివ్‌ రావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే పద్మారావును ఇటీవల ఎవరెవరు కలిశారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక తాజాగా పద్మారావుతో పాటు హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ కూడా కరోనా బారిన పడటంతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు.

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరిగిపోతోంది. హోంమంత్రి మహమూద్‌ ఆలీ, డిప్యూటీస్పీకర్‌ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరడ్డి గోవర్ధన్‌, బిగాల గణేష్‌ గుప్తా, కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు, గూడురు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సైతం కరోనా బారిన పడ్డారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *