ఒకే కుటుంబంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. కొత్తపేటలో హై అలర్ట్‌

By Newsmeter.Network  Published on  2 April 2020 4:52 AM GMT
ఒకే కుటుంబంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. కొత్తపేటలో హై అలర్ట్‌

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య 2వేలకు చేరినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు దేశంలో అదుపులో ఉందనుకున్న కరోనా మహమ్మారి.. తబ్లిగ్‌ జమాత్‌ సంస్థ నిర్వహించిన మత ప్రార్థనలతో ఒక్కసారిగా విజృంభిస్తుంది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అధికశాతం మందికి కరోనాసోకడం.. వారంతా వివిధ రాష్ట్రాల వారు చెందిన వారు కావటం, ఇప్పటికే వారివారి స్వస్థలాలకు వారు చేరిపోవడంతో వారి నుంచి కాంటాక్ట్‌ కేసులు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఏపీపై పడింది. ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Also Read :నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. పాజిటివ్‌ వచ్చిన వారు నివసించే ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా కిలో మీటరు మేర భారికేడ్లను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. అదేవిధంగా అత్యవసర వస్తువులు, నిత్యావసర సరుకులైన కూరగాయలు, 24గంటలు అందుబాటులో ఉండే మెడికల్‌ షాపులను నాలుగు రోజుల వరకు బంద్‌ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతంలో కరోనా వ్యాప్తి జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు, వారిని ఎవరు కలిశారు అనేదానిపై పోలీసులు ఆరాతీస్తూ.. వారికిసైతం కరోనా పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.

Also Read :దేశంలో 2వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు

ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజు ఐదు పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రావడం జిల్లా వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లోని వారంతా ఢిల్లి నుంచి వచ్చిన వ్యక్తులను కలిసిన వారేనని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ యంత్రాంగం పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్‌ కంటైన్‌మెంటు ట్రీట్‌మెంట్‌తో సహా ఇంటింటి సర్వే చేపట్టింది.

Also Read :షుగర్ వ్యాధి ఉన్న వారు ‘క్యారెట్’ తీసుకుంటే ప్రమాదమా..?

Next Story
Share it