తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
By సుభాష్ Published on 19 Aug 2020 6:52 AM IST![తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/08/Corona-positive-for-MLA.jpg)
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను సైతం ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా, తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజాల సురేందర్‌రెడ్డికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల జిల్లాలోని రామారెడ్డి మండలంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఎమ్మెల్యేను ఎవరెవరు కలిశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..Next Story