ప్ర‌పంచ వ్యాప్తంగా 30ల‌క్ష‌లు.. ఒక్క అమెరికాలోనే 10ల‌క్ష‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2020 6:29 AM GMT
ప్ర‌పంచ వ్యాప్తంగా 30ల‌క్ష‌లు.. ఒక్క అమెరికాలోనే 10ల‌క్ష‌లు

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి నియంత్ర‌ణ‌కు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటింది. సోమ‌వారం కొత్త‌గా 65,819 కేసులు న‌మోదు కావ‌డంతో.. మొత్తం కేసుల సంఖ్య 30,59,081 కి చేరింది. ఇక ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 2,11,202 మంది మృత్యువాత ప‌డ్డారు. గ‌త నాలుగు వారాలుగా మృతుల సంఖ్య 5వేలు దాటుతోంది. మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి ‌దాకా 9,19,746 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 19,28,133 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 5,621 మంది రోగులు ఐసీయూలో ఉన్నారు.

అమెరికాలో విల‌య‌తాండ‌వం..

అమెరాకాలో అయితే.. ఈ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. సోమ‌వారం ఒక్క రోజే 20,883 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 10,08,043కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 56,649 మంది మర‌ణించారు. న్యూయార్క్‌లో అత్య‌ధికంగా మూడు ల‌క్ష‌ల కేసులు న‌మోదు కాగా.. ఆ త‌ర్వాత స్థానంలో న్యూజెర్సీ ఉన్న‌ది. అమెరికాలో ఎక్కువ ప్ర‌భావానికి గురైన రాష్ట్రాల్లో పెన్‌సిల్వేనియా, ఇలియ‌నాస్‌, మిచిగ‌న్‌, జార్జియా, ఫ్లోరిడా, లూసియానా, టెక్సాస్‌, కాలిఫోర్నియా కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం ఈశాన్య రాష్ట్రాల్లోనే వైర‌స్ కేసులు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

ర‌ష్యాలో క‌రాళ నృత్యం..

ర‌ష్యాలో కరోనా క‌రాళ‌నాట్యం ఆడుతోంది. ఐదు రోజులుగా 3 వేల‌కు పెగా కేసులు న‌మోదు అవుతున్నాయంటే.. అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సోమ‌వారం 6,198 కొత్త కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 87,147కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 794 మంది మ‌ర‌ణించారు.

భార‌త్‌లో విజృంభ‌ణ‌..

ఇక భార‌త్ లో కూడా క‌రెనా విజృంభిస్తోంది. గ‌డచిన 24 గంట్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 1543 పాజిటివ్ కేసులు న‌మోద కాగా.. 62 మంది చ‌నిపోయారు. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 934 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం బాధితుల్లో 6869 మంది కోలుకోగా.. 21,632 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story