మర్కజ్ వెళ్లిన వారికే కాదు.. అక్కడికి వెళ్లిన వారికి కూడా కరోనా..!
By సుభాష్ Published on 13 April 2020 2:56 AM GMTదేశంలో కరోనా అంతకంతకు పెరుగుతోంది. ఇక నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన మరో ఘటన కలకలం రేపుతోంది. దేశంలో మొదట్లో నెమ్మదిగా విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదాంతంత తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. అప్పటి నుంచి మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. అయితే మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితోనే పాజిటివ్ కేసులు పెరిగిపోయాయని అనుకున్నా..మరో ఉదాంతంతో కూడా కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం తెరపైకి వచ్చింది.
మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికే కరోనా పాజిటివ్ వస్తుందని ముందుగా గుర్తించిన అధికారులు.. జాగ్రత్తలు చేపట్టారు. మర్కజ్‌కు వెళ్లిన వారికే కాదు.. ఉత్తప్రదేశ్ లోని దేవ్ బంద్ దర్గాకు వెళ్లి వచ్చిన వారి వల్ల కూడా కరోనా కేసులు పెరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మర్కజ్‌తో పాటు, దేవ్‌బంద్ దర్గాకు వెళ్లి వచ్చారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు గోప్యంగా ఉంచినట్లు తెలియనడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరిలో ఒకరికి పాజిటివ్ తేలగా, వీరిపై ఐపీసీ సెక్షన్ 269,270,271, సెక్షన్ -3 ఎపిడమిక్ యాక్ట్ 1897తో పాటు 54 ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2005కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పాజిటివ్ వచ్చిన సదరు వ్యక్తి పలు అధికారిక కార్యక్రమాలకు, రివ్యూ సమావేశాలకు కూడా హాజరైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
కరోనా వచ్చిన వ్యక్తిని కలిసిన వారిలో పలువురు జిల్లాకు చెందిన అధికారులున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ వ్యక్తి కీలక ఉన్నతాధికారులను కూడా కలిసినట్లు సమాచారం. ఇంకా ఎవరెవరిని కలిశాడన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద మర్కజ్ ఉదాంతమే కాదు.. యూపీలోని దేవ్‌బంద్ దర్గా ఉదాంతం కూడా తెరపైకి వస్తోంది.