దోమకాటుకు కరోనా వస్తుందా..? కేంద్ర ఆరోగ్యశాఖ ఏం చెబుతోంది

By సుభాష్  Published on  26 March 2020 4:25 PM IST
దోమకాటుకు కరోనా వస్తుందా..? కేంద్ర ఆరోగ్యశాఖ ఏం చెబుతోంది

ఏదైన వార్త వైరల్‌ అయ్యింది అంటే అది సోషల్ మీడియానే అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ప్రతీ ఒక్కటి వైరల్‌ అవుతూనే ఉంటుంది. అందులో ఏది ఫేక్‌.. ఏది రియల్‌ అనేది చెప్పలేని పరిస్థితి. తాజాగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో రకరకాలుగా పోస్టులు సోషల్‌ మీడియాలో వెలువడుతున్నాయి. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనిదిగా సృస్టిస్తూ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఇక కరోనాపై కొన్ని పోస్టులు చూస్తుంటే భయాందోళన కలిగించేలా ఉన్నాయి. ఈ సోషల్‌ మీడియా కారణంగా ప్రజల్లో లేనిపోని అనుమానాలు, భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దోమకాటు వల్ల కరోనా వైరస్‌ వస్తుందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్ల షికార్లు కావడంతో ప్రజలకు మరింత భయం పట్టుకుంది.

దీంతో ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. దోమకాటు వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. అంతేకాదు.. మందు తాగడం వల్ల, వెల్లుల్లి తినడం వల్ల కరోనా రాకుండా అడ్డుకోలేమని కూడా స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అలాంటి ఫేక్‌ పోస్టులపై పోలీసులు నిఘా ఉంచారని, ఫేక్‌ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

Next Story