తెలంగాణలో డ్వాక్రా మహిళలకు కరోనా రుణాలు.. ఎంత అంటే

By సుభాష్  Published on  18 Jun 2020 3:10 PM IST
తెలంగాణలో డ్వాక్రా మహిళలకు కరోనా రుణాలు.. ఎంత అంటే

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా అంతే నమోదువుతున్నాయి. కరోనా దెబ్బకు వ్యాపారస్తులు, పరిశ్రమలు ఇబ్బందుల్లో పడిపోయాయి. కరోనా కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మందగించాయి. ఇక భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది కరోనా వైరస్‌. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కోవిడ్‌ -19 రుణాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహిళా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.5వేల చొప్పున రుణం ఇవ్వనుంది. దీంతో రాష్ట్రంలోని ఆయా మండలాల్లో ఈ కరోనా రుణాలపై అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇక తీసుకున్న రుణాలు నెలకు రూ.300 చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాలపై ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మూడు నెలలుగా పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఇక రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బుధవారం 269 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ కేసుల సంఖ్య 5675కు చేరుకుంది. ఇందులో 2,412 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 3,071 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 192కు చేరుకుంది. ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో నమోదు కావడంతో నగర ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

Next Story