తెలంగాణలో 13 కరోనా ఫ్రీ జిల్లాలు ఇవే..
By సుభాష్ Published on 1 May 2020 1:22 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టగా, నిన్న 22 కేసులు నమోదయ్యాయి. అయితే గత నాలుగు రోజులుగా హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులేమి నమోదు కావడం లేదు. దీంతో పాటు తక్కువగా కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో బాధితులందరూ కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 13 కరోనా ఫ్రీ జిల్లాలను ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు:
1. యాదాద్రి భువనగిరి
2. వరంగల్ రూరల్
3. పనపర్తి
కరోనా నుంచి కోలుకుని యాక్టివ్ కరోనా కేసులు లేని జిల్లాలు:
1. సిద్దిపేట
2. సంగారెడ్డి
3. నారాయణపేట
4. మంచిర్యాల
5. మహబూబాబాద్
6. పెద్దపల్లి
7. ములుగు
8. నాగర్ కర్నూలు
9. సంగారెడ్డి
10. జగిత్యాల
కాగా, గత 14 రోజులుగా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ఐదు జిల్లాలున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి. ఇక గురువారం 22 కేసులతో కలిపి మొత్తం తెలంగాణలో 1038 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 442 మంది కోలుకోగా, 28 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 568 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.